అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో నిఖిల్. వరుస అపజయాల తరువాత అర్జున్ సురవరం సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. గతంలో చందుమొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగ వసూలు చేశాడు. ఇప్పుడు ఆ సిమిమాకు సిక్వెల్ గా కార్తికేయ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు నిఖిల్. దానికి సంబంధించి ఒక పిక్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ…వర్క్ జరుగుతుంది…టార్గెట్ అందుకోడానికి ఇంకో నాలుగు వారాలు మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో కార్తికేయ 2 సినిమాతో పాటు 18 పేజీస్ సినిమా ఉంది.