శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్. ఆ తర్వాత ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే తన కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మూవీస్ లో కార్తికేయ ఒకటి.
ఈ సినిమా నిఖిల్ కు ఎంతో ప్రత్యేకమైనది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా 2020 లో అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు నిఖిల్.
అది కూడా లవ్ మ్యారేజ్. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే వీరి ప్రేమ ఎక్కడ మొదలైంది. ఎలా మొదలైంది… అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.
శృతి మించిన సుమ అక్క కామెడీ మీరు కూడా ఇలానా? ఏంటండీ ఇది..!
ఆ వివరాలు చూసుకుంటే ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ లో ఈ ఇద్దరూ కలుసుకున్నారట. పల్లవి ని చూడగానే నిఖిల్ కు నచ్చేసిందట. అక్కడే ఆమె వెంట పడటం మొదలు పెట్టాడట.
అంతేకాకుండా మొదట నిఖిల్ వెళ్లి ప్రపోజ్ చేసాడట. పల్లవి మాత్రం ముందు జోక్ అని అనుకుందట. తర్వాత ఓకే చెప్పకుండా ఇంట్లో వాళ్లని అడిగిందట. నిఖిల్ సినిమా హీరో అని చెప్పకుండా బిజినెస్ మ్యాన్ అని ఇంట్లో చెప్పిందట పల్లవి.
RRR సినిమా గురించి తప్పుగా కామెంట్ చేసిన విదేశీయుడికి అదిరిపోయే పంచ్ వేసిన RRR టీం
ఇక నిఖిల్ నటించిన హ్యాపీడేస్, కార్తికేయ సినిమాలు మాత్రమే పెళ్లికి ముందు చూసిందట పల్లవి. పెళ్లి తర్వాత బలవంతంగా చూపించాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.