నితిన్ హీరోగా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా భీష్మ. మంచి హైప్‌తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై హీరో నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా నితిన్… తన అనుభవలను కూడా షేర్ చేసుకున్నాడు.
గతంలో నితిన్‌కు ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. ఓ దశలో ఇక నితిన్ కేరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నా… ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ ఆ తర్వాత తను సొంతగా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చల్ మోహన రంగతో పాటు మరో చిత్రం కూడా భారీ నష్టాలనే మిగిల్చింది.
నిజానికి నితిన్‌కు మంచి మార్కెటే ఉంది. ఎంత కాదన్న కనీసం 5 కోట్లయిన సంపాదించుకోగలడు. కానీ స్వియ నిర్మాణంలో ఎక్కువ సంపాదన కన్నా… పొగొట్టుకోవటమే ఎక్కువగా ఉండటంతో ఇక చిత్ర నిర్మాణం వైపు చూసే ఉద్దేశమే లేదంటూ స్పష్టం చేశాడు.