వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇటలీ షెడ్యూల్ రద్దవటంతో షూటింగ్ స్పాట్ ను దుబాయ్‌కు మార్చుకుంది. దుబాయ్ వెళ్లిన వెంటనే అక్కడ చిత్రీకరణను ప్రారంభించారు. అక్కడ షూటింగ్ స్పాట్‌లో కీర్తి నిద్రపోతున్న ఫొటోను నితిన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
షాట్ గ్యాప్‌లో కళ్లపై టవల్ వేసుకుని కీర్తి నిద్రపోతుంటే నితిన్, డైరెక్టర్ వెంకీ ఆమె వెనకాల చేరి ఆట పట్టించారు. తాము చెమటలు చిందిస్తుంటే.. కీర్తి హాయిగా నిద్రపోతోందని పేర్కొంటూ ఆ ఫొటోను నితిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు కీర్తి స్పందిస్తూ.. మీరు జెలసీగా ఫీలవుతున్నారు కదా అని కామెంట్ చేసింది.
రంగ్ దే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
You’re just jealous, aren’t you?! 😆 https://t.co/Ot9WDGbMUA
— Keerthy Suresh (@KeerthyOfficial) November 26, 2020