భీష్మ మూవీ సక్సెస్ తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేసిన యంగ్ హీరో నితిన్… రంగ్ దే షూటింగ్ ను పూర్తి చేయబోతున్నాడు. ఇప్పటికే దుబాయ్ లో ఈ మూవీ షూట్ లాస్ట్ షెడ్యూల్ కొనసాగుతుండగానే… తన 30వ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.
బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ అందాదున్ సినిమా రీమేక్ చేయనున్న నితిన్… వచ్చే మార్చి కల్లా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేశాడు. ఈ షూటింగ్ శనివారం మొదలవ్వగా, పాండిచ్ఛేరి చుట్టు ప్రక్కలా ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఠాగూర్ మధు, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.
#Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati pic.twitter.com/HDRjnFpKQa
— nithiin (@actor_nithiin) December 6, 2020
Advertisements