పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ‘ఆది పురుష్’ మూవీ ఒకటి. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ లో ప్రభాస్ కు అభిమానులు ఒక రేంజ్ లో పెరిగిపోయారు. అయితే బాహుబలి తరవాత మాత్రం ప్రభాస్ కు మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు. ఈ సినిమా తరవాత సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ ముందుకు రాగా అవి ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక ఆదిపురుష్ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, సీత పాత్రలో హీరోయన్ కృతి సనన్ నటిస్తున్నారు. అంతే కాకుండా విలన్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.
మన ఇతిహాసం రామాయణంను ‘ఆది పురుష్’ గా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం ‘ఆది పురుష్’ టీజర్ ను అయోధ్యలో విడుదల చేశారు. ఈ మధ్యే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఈ టీజర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉంటే ఆది పురుష్ లోని కొన్ని సీన్లను హాలీవుడ్ నుండి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సినిమాలో సైఫ్ అలీఖాన్ పక్షి పై ఎగురుతూ వచ్చే ఓ సీన్ ఒకటి ఉంటుంది. కానీ ఆ సీన్ ను హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమా నుండి కాపీ కొట్టారంటూ వైరల్ అవుతుంది. అంతే కాకుండా రైస్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ నుండి మరో సీన్ కాపీ కొట్టారట. ఈ సినిమాలతో పాటూ హారిపోటర్ నుండి కూడా మరికొన్ని సీన్లు కాపీ కొట్టారంటూ ట్రోల్స్ వస్తున్నాయి.