ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్ నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆది పురుష్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా ప్రభాస్ ఆది పురుష్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ టీజర్ ని ఆదివారం సాయంత్రం అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్ గా లాంచ్ చేశారు. రాముడు చివరి దశలో ఈ సరయు నదిలోకి వెళ్లిపోయాడని అంటూంటారు. అలా ఇప్పుడు రాముడు తిరిగిన నేలపైనే ఆది పురుష్ మూవీ టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మూవీ మేకర్స్.
ఒక నిమిషం 46 సెకన్ల నిడివితో కూడిన ఆది పురుష్ టీజర్.. భూమి కుంగినా నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అనే డైలాగ్ తో ఆది పురుష్ టీజర్ ప్రారంభమైంది. వస్తున్నా.. న్యాయం అనే రెండు పాదాలతో పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి.. అంటూ భారీ డైలాగ్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంది టీజర్. దీనికి భారీ విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ఈ టీజర్ కట్ చేశారు. రాముడిగా ప్రభాస్ లుక్ అబ్బురపరిచింది. నీళ్ళల్లో తప్పస్సు చేస్తూ ప్రభాస్ కనిపించించిన షాట్ టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కాగా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నన ఈ చిత్రం… పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది.