భీం ఫర్ యు… అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త పోస్టర్ ని సోషల్ మీడియా వేదిక రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ని చూపిస్తూ కనిపించారు. అయితే ఈ పోస్టర్ రిలీజ్ చేసిన నిమిషాల్లోనే వేల లైకులు వచ్చాయి. అభిమానులు కూడా ఈ పోస్టర్ ని చూసి షాక్ అవుతున్నారు. కాగా తాజాగా దగ్గుబాటి రానా తనదైన శైలిలో పోస్టర్ పై కామెంట్ పెట్టారు.
రామారావు… భీముడు లుక్ లో పిచ్చెక్కించేశావు అంటూ ఫైర్ సింబల్స్ పెట్టాడు. ప్రస్తుతం రానా చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రం జనవరి 7 2022 లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే డిసెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
RamaRao…..Bheemudu look lo pichiekkechesavu 🔥🔥🔥🔥 https://t.co/VXEqKV7C4f
— Rana Daggubati (@RanaDaggubati) December 6, 2021