కరోనా మహమ్మారి సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. ఇక ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాజశేఖర్ ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. కరోనా మహమ్మారి పై పోరాడి కరోనాను జయించి ఇంటికి చేరుకుని దీపావళి పండుగను జరుపుకున్నారు.
దీనికి సంబంధించిన ఓ ఫోటోను రాజశేఖర్ కూతురు శివాత్మిక తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. నాన్న కరోనా నుండి కోలుకుంటున్నాడు. మీ ప్రార్థనలు నాన్నను కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేశాయి. అందరికి ధన్యవాదాలు అంటూ..శివాత్మిక ట్వీట్ చేసింది.
Happy Deepavali from mine to yours💜
Nanna is recovering! Thank you all so much for your love and blessings!
Stay safe🤗 loads of love 🌟 pic.twitter.com/bUUFnQR7pB— Shivathmika Rajashekar (@ShivathmikaR) November 14, 2020