యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బంపర్ హిట్ కొట్టేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా రూపొందడంతో మొదటి నుంచి ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకున్న ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయింది. అందులోనూ ఈ సినిమాకు తగ్గట్టుగా రామ్ తన గెటప్ ను మార్చుకొని.. అందరిచేత ప్రశంసలందుకున్నాడు.
ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా ‘రొమాంటిక్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ యాంగిల్ లో తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాతో ఆకాష్ కు బిగ్ హిట్ ఇవ్వాలని పూరీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలో మాస్ వాయిస్ తో అదరగొట్టగల రామ్ తో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు పూరీ ట్రై చేస్తున్నాడు. అందుకు రామ్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కేతికా శర్మ కథ నాయికగా నటిస్తోంది.మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరీ సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి