లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలు చేసే రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. ఇదే జోష్ లో తన నెక్స్ట్ సినిమాని కిషోర్ కుమార్ తిరుమల దర్శకత్వంలో RED సినిమాని మొదలుపెట్టాడు. #RED పూజాకార్యక్రమాల రోజునే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. అయితే రామ్ సినిమా అనగానే ముందుగా గుర్తుకువచ్చేది దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. రామ్ ఎనర్జికి డీఎస్పీ మ్యూజిక్ కలిస్తే ఆ సౌంగ్ సూపర్ హిట్ అవుతుంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది దేవి శ్రీ ప్రసాద్ ని భర్తీ చేస్తూ మణిశర్మ లైమ్ లైట్ లోకి వచ్చాడు. రీసెంట్ గా ఈ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మని REDకి కూడా కంటిన్యూ చేస్తూన్నాడు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పూరి రామ్ మళ్లీ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేయనున్న ఈ కాంబినేషన్ కి మణిశర్మ కూడా కాల్వునున్నాడని సమాచారం. అదే నిజమైతే రామ్, దేవి కలయికలో ఇప్పట్లో సినిమా చూడడం కష్టమే.