కొరటాల దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్‌ను విడుదల చేశారు. సిద్ధ సాగా పేరుతో విడుదలైన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్నతో ఆడటం కంటే సినిమా రంగంలో 40 సంవత్సరాలుగా, 150 సినిమాలకు పైగా నటించిన వ్యక్తి అనటం నన్ను భయపెడుతుందని అన్నారు చరణ్.
అలాగే ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ… చిరంజీవి వంశానికి కొత్త కామ్రేడ్‌ని నేనని అతను ప్రారంభించిన మొత్తం ఉద్యమంలో నేను పాల్గొంటానని అన్నారు. తన పాత్ర మొదట గెస్ట్ అప్పియరెన్స్‌గా ప్రారంభమైందని, అయితే చివరికి 40 నిమిషాల పాత్రగా మారిందని తెలిపారు. సెకండాఫ్‌లో ఎక్కువ భాగం చరణ్ కనిపించనున్నాడట. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4, 2022న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.