ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ప్రేక్షకులను మెప్పించిన హీరో రామ్… మరోసారి మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్నాడు. రెడ్ మూవీలో రామ్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్స్ గా నటించగా… సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా రెడ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. తమిళంలో విజయవంతమైన తడమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కించగా, మణిశర్మ మ్యూజిక్ అందించారు.