ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఇమేజ్ సొంతం చేసుకొని… అదే మూడ్ లో రెడ్ తో వచ్చి బోల్తా కొట్టిన హీరో రామ్. ఆ తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకొని, ఫైనల్ గా కన్నడ డైరెక్టర్ లింగుస్వామితో జతకట్టాడు. ఒకప్పుడు లింగుస్వామి అంటే ఫుల్ ఫేమస్. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు లింగుస్వామితో జతకట్టే ప్రయత్నం చేసిన వారే. బన్నీ మూవీ అయితే సెట్స్ పైకి వచ్చే దశలో రద్దయింది.
రన్, పందెంకోడి వంటి సినిమాలు తీసినప్పటికీ… ఇటీవల లింగుస్వామి హిట్ ట్రాక్ లో లేడు. దీంతో లింగుస్వామి కథ రెడీ చేస్తుండగా… రామ్ కథ తనకు ఎలా ఉండాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. రెడ్ మూవీ భయమే ఇందుకు కారణమని ఇండస్ట్రీ టాక్.
లింగుస్వామి-రామ్ మూవీలో ఉప్పెన హీరోయిన్ క్రితిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.