టాలీవుడ్ భల్లాలదేవుడు పెళ్ళికి మరి కొన్ని గంటలు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే దగ్గుబాటి వారి ఇంట పెళ్లిసందడి వాతావరణం నెలకొంది. తాజాగా దగ్గుబాటి రానా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో రానాతో పాటు తండ్రి సురేష్ బాబు, విక్టరీ వెంకటేష్ సాంప్రదాయ దుస్తుల్లో మెరవగా పైన రెడీ అంటూ రాసుకొచ్చాడు.ఇక ఆ ఫోటో చూసిన అభిమానులు అభినందనలు తెలుపుతుంటే… మరికొంత మంది భల్లాలదేవుడు పెళ్ళికి బాహుబలి వస్తున్నాడా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాను ప్రేమించిన మిహిక బజాజ్ ను పెళ్లిచేసుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.