టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులుగా వరుసగా రోజుకు ఒకరిని విచారిస్తున్న ఈడీ టీం… తాజాగా రవితేజను విచారిస్తుంది. అప్రూవర్ గా మారిన డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ను ఎదురుగా కూర్చోబెట్టి ఆర్థిక లావాదేవీలు, ఎక్కడ ఎప్పుడు డ్రగ్స్ ఇచ్చారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నందులను ఈడీ విచారించగా, తాజాగా రవితేజను విచారిస్తుంది. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగనుంది.