మాస్ మహారాజ్ రవితేజ సంక్రాంతి బరిలో ఉన్నాడు. క్రాక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇటీవల తను పెద్ద హిట్ కొట్టిన దాఖలాలు ఏమీ లేవు. దీంతో ఆ ప్రభావం రవితేజ్ తర్వాతి సినిమాల్లో రెమ్యూనరేషన్, సినిమా బడ్జెట్ పై పడుతుంది. ఒక్క ఖిలాడి సినిమా మాత్రమే షూటింగ్ దశలో ఉండగా పలువురు డైరెక్టర్లతో రవితేజ సినిమాలపై చర్చిస్తున్నారు.
డైరెక్టర్ మారుతి సినిమాలో ఇప్పటికే రెమ్యూనరేషన్ తక్కువగా ఉందన్న కారణంగా రవితేజ తప్పుకోగా…. డైరెక్టర్లు త్రినాథరావు నక్కిన, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడితో జరుపుతున్న చర్చలను కూడా హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా భారీ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్న రవితేజ, సినిమా హిట్ కొడితే రెమ్యూనరేషన్ విషయాల్లో గ్యాప్స్ ఉండవన్న కారణంగానే హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ క్రాక్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.