ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సాయికుమార్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి కృప వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తిరుపతి ప్రాంతం లో ఇప్పటివరకు చాలా షూటింగ్ లు జరిపామని, తాజా గా శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమా షూటింగ్ తిరుపతిలో సాయంత్రం ప్రారంభిస్తున్నామన్నారు. స్వామివారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు సాయికుమార్ తెలిపారు.