సాయితేజ్ హీరోగా, డైరెక్టర్ కార్తి దండు కాంబోలో ఓ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఆ సినిమా టైటిల్ ను మూవీ యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీరెకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరు ఖరారు చేశారు.
ఇందులో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా టైటిల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ను వదలడం విశేషం.
అసలు నిజాన్ని చూపించే మరో నేత్రమే ‘విరూపాక్ష’.. అంటూ టైటిల్ విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. సుకుమార్ స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు.
అయతే ఆ మధ్య ప్రమాదానికి గురైన సాయితేజ్ కి కొంత గ్యాప్ వచ్చేసింది. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమానే ‘విరూపాక్ష’. కెరియర్ పరంగా సాయితేజ్ కి ఇది 15వ సినిమా కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.
c