ఇతర సినిమాల కన్నా బయోపిక్ సినిమాల గ్యారెంటీ కలెక్షన్స్ ఉంటుండటంతో… ఇప్పుడు అందరి దృష్టి బయోపిక్స్‌పై పడింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని, అంతే వేగంగా కనుమరుగైన హీరో ఉదయ్ కిరణ్ జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ కు రంగం సిద్ధం అయింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ తియ్యాలని ఎంతో మంది అనుకున్నా… ఎవ్వరు ధైర్యం చేయలేకపోయారు.
ఇప్పుడు తాజా సందీప్ కిషన్ ఈ బయోపిక్ పై ముందుకు వచ్చాడు. ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఒక్కసారిగా ఎగసిపడ్డ కెరటంలా లేచి అంతే వేగం తో కిందపడ్డ ఓ యంగ్ హీరో. అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ జీవితం పై ఇప్పడు కథ సిద్ధం అయ్యింది. జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. దీనిపై పూర్తి సమాచారాన్ని త్వరలోనే విడుదల చెయ్యబోతున్నారు. మరో వైపు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా సందీప్ కిషన్ బాధ్యతలు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.