వేణుమాధవ్‌తో సన్నిహితంగా వుండే శివాజీ తన మిత్రుడి మరణంపై కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. ‘నేను, అలీ, ఉత్తేజ్, వేణుమాధవ్.. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం.. అలీ.. వేణుమాధవ్ అయితే దాదాపు అన్నదమ్ముల్లా వుండేవాళ్లు.. ఇన్నాళ్లూ మాతో నడిచిన మా అనుంగు మిత్రుడు మా మధ్య లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం..’ అని శివాజీ తొలివెలుగు ప్రతినిధి రాకేశ్ దగ్గర కళ్లనీళ్లు పెట్టుకున్నారు.