ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన టూ వీలర్ ఉత్పత్తిదారుగా హీరో మోటోకార్ప్ కొనసాగుతోంది. సాధారణ టూవీలర్స్ మొదలుకొని ప్రీమియం మోటార్ సైకిళ్లను నాణ్యతతో అందించే కంపెనీగా హీరో గుర్తింపు పొందింది. ముఖ్యంగా హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ బైక్ రెండు దశాబ్దాల నుంచి ప్రజల ప్రియమైన టూవీలర్‌గా కొనసాగుతోంది. అయితే హీరో స్ప్లెండర్ బైక్ కు ఏబీ కస్టమ్స్ వారు పలు మోడిఫికేషన్లు చేశారు. దీంతో ఆ బైక్ అద్భుతమైన లుక్‌తో కనిపిస్తోంది.
ఏబీ కస్టమ్స్ అనే ఓ యూట్యూబ్ చానల్ వారు స్ప్లెండర్ బైక్ ను మోడిఫై చేశారు. దాని పార్ట్‌లు అన్నింటినీ విడదీశారు. ఈ క్రమంలో బైక్‌కు ఉన్న సాధారణ టైర్లను తీసి వెడల్పాటి టైర్లను అమర్చారు. ముందు వెనుక భాగాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఇక పెట్రోల్ ట్యాంక్ తీసేసి ప్యాషన్ బైక్ ట్యాంక్‌ను అమర్చారు. ఆ ట్యాంక్‌తోపాటు ముందు భాగంలో మడ్గర్ రేకు, పక్క భాగాల్లో గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. వెనుక భాగంలో ఎగ్జాస్ట్‌ను పూర్తిగా మార్చేశారు. చిన్నపాటి హ్యాండిల్‌ను ఏర్పాటు చేశారు.
Watch Video:
Advertisements
ఇక సీట్‌ను పూర్తిగా తొలగించి కొంత హైట్ లేపి నూతన తరహా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో డోమ్ తొలగించి సాధారణ లైట్‌ను ఉంచారు. అలాగే ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. ఈ క్రమంలో బైక్ అద్భుతంగా రూపుదిద్దుకుంది. దాన్ని చూసిన వారెవరైనా సరే అది స్ప్లెండర్ బైక్ అని గుర్తు పట్టరు. అదేదో కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బైక్ కావచ్చు.. అని అనుకుంటారు. అంతలా స్ప్లెండర్ బైక్ ను మోడిఫై చేశారు. ఈ క్రమంలో మోడిఫై చేసిన ఆ బైక్ తాలూకు ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరూ ఇది స్ప్లెండర్ బైకేనా అని ఆశ్చర్యపోతున్నారు. అంతలా ఆ బైక్ మారిపోయింది.