కరోనా కారణంగా థియేటర్లకు జనాలు వస్తారో లేదో తెలియక.. కొత్త సినిమాల నిర్మాణం మొదలుపెట్టాలంటేనే నిర్మాతలు జంకుతున్నారు. చాలా మంది హీరోలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అలాలంటి యువ నటుడు శ్రీ విష్ణు మాత్రం వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలకు సంతకం చేశాడు.
ఇప్పటికే ఈ ఐదింటిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు సెట్స్‌పై ఉన్నాయి తేజ మర్ని డైరెక్షన్ లో చేస్తున్న చిత్రాన్ని గురువారం లాంఛ్ చేశారు. హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్న మూవీ దాదాపుగా చివరి దశలో ఉంది. ఇక గాలి సంపత్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే మరో 2 సినిమాలకు సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది.