విభిన్నమైన కథలను ఎంచుకుని యూత్ కి మంచి సందేశం ఇస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హీరో శ్రీ విష్ణు. అయితే శ్రీ విష్ణు మరోసారి డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజరాజ చోళ సినిమా షూటింగ్ పూర్తవగా.. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గాలి సంపత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కథ కు శ్రీ విష్ణు ఓకే చెప్పాడట.
ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఇప్పటివరకు శ్రీ విష్ణు చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు టాప్ టెక్నీషియన్లను కూడా ఈ సినిమా కోసం రెడీ చేశాడట. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది.