హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీకాంత్, భార్య ఊహ, కొడుకు రోషన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే గౌరీ రొనంకి దర్శకత్వంలో రోషన్ హీరోగా పెళ్లి సందD చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది.
మరోవైపు శ్రీకాంత్…. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రంలో విలన్ గా నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే శ్రీకాంత్ కు విలన్ గా మంచి పేరును తీసుకువచ్చింది.