శ్రీకాంత్ కెరీర్ లో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి పెళ్లి సందడి. ఓ రకంగా చెప్పాలంటే శ్రీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం. ఇప్పుడు అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి సందడి తో మ్యాజిక్ చేసిన రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండడం విశేషం.
రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా… ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ నడుస్తుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ అతిథి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో కథని మలుపుతిప్పే పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తారని, ఆయన ఉండేది కొద్దిసేపే అయినా, ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేములో కనిపించడం అనేది ఎప్పటికైనా కొత్తగా అనిపిస్తుంది.
ఇక ఈ మూవీని జనవరి నుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.