తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయాలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆల్ ఇండియా సుమన్ యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన 2023 ఏడాది క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.పవన్ కు అభిమానుల ఫాలోయింగ్ చాలా ఉందని.. బహుశా ఆయనకున్నంత మంది ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఎవరికీ లేరని సుమన్ అన్నారు.
అది పవన్ కళ్యాణ్ కు ఒక వరమని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ విషయానికొస్తే.. బీఆర్ఎస్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ చాలా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.
బెంగుళూరుకు ధీటుగా తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో బెంగుళూరును కూడా తెలంగాణ వెనక్కి నెట్టి ప్రపంచస్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు హీరో సుమన్.