రెండు రోజుల నుంచి హీరో సుమంత్ రెండో పెళ్లి గోల మామూలుగా లేదు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా దీనిపై స్పందించి.. ఇంకా బుద్ధి రాలేదా..? అంటూ సుమంత్ ను ఓ ఆటాడుకున్నాడు. అయితే ఆర్జీవీ ట్వీట్ పై స్పందించిన సుమంత్.. తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఖండించాడు.
ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసిన సుమంత్.. రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ పెళ్లికార్డు తనకు సంబంధించిందే గానీ.. రియల్ ది కాదని సినిమాకు సంబంధించిన కార్డు అని చెప్పుకొచ్చాడు.
తాను నటిస్తున్న కొత్తం చిత్రం పెళ్లి, విడాకులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోందన్న సుమంత్.. అక్కడి సెట్స్ నుంచి కార్డు లీక్ అయిందని వివరణ ఇచ్చాడు. త్వరలోనే ఆ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామన్నాడు సుమంత్.