సరికొత్త కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు హీరో సుమంత్. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా ఒకటి రెండు మినహా సరైన హిట్స్ మాత్రం ఖాతాలో లేవు. ప్రస్తుతం సుమంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కపటధారి. పోలీస్ డిపార్ట్మెంట్ కి అంతుపట్టని ఆ హంతకుడి రహస్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎలా కనుక్కున్నాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
తాజాగా ఈ చిత్ర థీమ్ ట్రైలర్ ను చిత్ర విడుదల చేసింది. నిజాన్ని బతికించడానికి ఓ మనిషి యుద్ధం చేయాలని చెప్పే థీమ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫిబ్రవరి 16న ఈ చిత్రం రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.