
బిగ్ బాస్ తో ఫేమస్ అయిన నటి మీరా మిథున్ కోలీవుడ్ వరుసగా ఒకరి తరువాత ఒకరిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు త్రిష పై విమర్శలు చేసింది. తన కెరీర్ ను నాశనం చేసిందని, త్రిషకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని, తనను తొక్కేయడానికి త్రిష ప్రయత్నించిందని వ్యాఖ్యానించింది. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, విజయ్‌ను మీరా తాజాగా టార్గెట్ చేసింది. బంధుప్రీతి కారణంగానే విజయ్, సూర్య తెరపైకి వచ్చారని, వీరు తమ ఫ్యాన్స్‌ను కూడా కంట్రోల్ చేయలేరని, గాజులు తొడుక్కొని కూర్చుంటారని వ్యాఖ్యానించింది. మీరా వ్యాఖ్యలపై నటి కస్తూరి, ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూర్యకు అండగా నిలిచారు. అయితే సూర్య ఈ వివాదంపై పరోక్షంగా స్పందించాడు. తక్కువ స్థాయి విమర్శలకు స్పందించి విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దని నా సోదరసోదరీమణులను కోరుతున్నా. ఆ సమయాన్ని సమాజ శ్రేయస్సుకోసం వినియోగించండి. నాకు మద్దతు తెలిపిన భారతీరాజా సర్‌కి ధన్యవాదాలని సూర్య ట్వీట్ చేశాడు.