ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుంది. దీనితో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్స్ కూడా మూసేశారు. దీనితో కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్మగల్ వంధాల్’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తానని సూర్య తెలిపాడు. దీనితో తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా సూర్య సినిమాలను అలాగే తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలను బ్యాన్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విషయమై స్పందించిన సూర్య తనకు ఉన్న అప్పు వలెనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపాడు. నాకు ఇప్పుడు 70 కోట్ల అప్పు ఉంది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు. అంతే కాదు ఇక నుండి తాను నిర్మించే సినిమాలు అని నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతాయని తెలిపాడు. తను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని వారికి నన్ను ప్రశ్నించే హక్కు లేదన్నారు.