ఆకాశం హద్దురా సినిమాతో విమర్శకులను సైతం మెప్పించిన హీరో సూర్య. చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ సాధించిన సూర్యకు… విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. సూర్య ప్రస్తుతం మణిరత్నం వెబ్ సిరీస్ నవరసలో నటిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ను డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వెబ్ సిరీస్ పూర్తి చేసి తన నెక్ట్స్ మూవీని వచ్చే నెల నుండి ప్రారంభించాలన్న ఆలోచనతో సూర్య ఉన్నాడని తెలుస్తోంది.
సూర్య వచ్చె నెలలో పండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు యాక్షన్ మూవీస్ డైరెక్టర్ గా పేరున్న హరితో సినిమా ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. పండిరాజ్ మూవీ పూర్తిగానే హరితో జాయిన్ కానున్నాడు.
ఇక వీటితో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.