తమిళ స్టార్ హీరో సూర్య క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న సూర్య ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వరకు చేరుకున్నాడు. అయితే ఇప్పుడు సూర్య తర్వాత చేయబోయే సినిమాలకు కూడా బలమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడట.
అన్నాత్తే ఫేమ్ దర్శకుడు శివ, సూరారై పొట్రు ఫేమ్ సుధా కొంగరతో నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నాడట సూర్య. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సూర్య కొత్త ప్రాజెక్ట్ ఎతర్క్కుం తునింధవన్ షూటింగ్ పూర్తయ్యింది. పాండిరాజ్ దర్శకత్వం వచ్చించిన ఈ చిత్రం వచ్చే నెల ఫిబ్రవరిలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.
అలాగే త్వరలో దర్శకుడు బాలాతో చేయనున్నారు. అంతేకాదు సూర్య వెట్రి మారన్‌తో వాడి వాసల్ సినిమా కూడా చేస్తున్నాడు. మరి చూడాలి సూర్య తన లైనప్ తో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాడో.