ఆకాశం నీ హద్దురా సినిమాతో హిట్ కొట్టి, ఫామ్‌లోకి వచ్చాడు హీరో సూర్య. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. చాలా కాలం తర్వాత హిట్ కొట్టిన సూర్య… త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. సూర్యకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. తన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. దీంతో నేరుగా తెలుగు సినిమా చేసే అవకాశం కనపడుతుంది.
మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తారని ప్రచారం సాగుతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరిద్దరి కాంభోలో హై ఓల్టేజ్ మూవీ వస్తే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పంట పండుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం రాబోతుంది.