టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హీరో తరుణ్ హజరుకాబోతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు తో విచారణ కు హాజరుకావాలని ఈడీ గతంలోనే సమన్లు జారీ చేసింది. గతంలో డ్రగ్స్ వ్యవహారం లో ఎక్స్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను ఎదుర్కొన్న తరుణ్ నుండి వెంట్రుకలు, గోర్లు సేకరించారు.
ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఈడీ తరుణ్ కు నోటీస్ లు పంపింది. 2017 ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా తరుణ్ ని విచారించే అవకాశం ఉంది. నవదీప్ ఏర్పాటు చేసిన పార్టీలు, ఎఫ్ లాంజ్ పబ్ వ్యవహారాలు, డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించనుంది. గతంలో తరుణ్ కూడా పలు పబ్ లను నడిపినట్లుగా ఈడీకి సమాచారం అందటంతో వాటిపై కూడా ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, తరుణ్ డ్రగ్స్ వాడిన ఆరోపణల్లో నిజం లేదని ఎఫ్.ఎస్.ఎల్ నివేదిక ఇచ్చిందని అబ్కారీ శాఖ గతంలోనే కోర్టుకు తెలపగా… ఆ వివరాలు ఇటీవల బయటకొచ్చాయి.