వరుసగా సినిమాలు తీసుకుంటూ పోయే విక్టరీ వెంకటేష్… ఇప్పటికే నారప్ప షూటింగ్ పూర్తి చేశారు. ఈ వేసవిలో నారప్ప రిలీజ్ కానుంది. ప్రస్తుతం వెంకీ… అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్-3లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఆగస్టు 27న ఈ మూవీ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.
ఇక వెంకీ ఇటీవల దృశ్యం-2 సినిమా రీమేక్ కూడా మొదలుపెట్టాడు. కేవలం రెండు షెడ్యూల్ లోనే ఈ మూవీ పూర్తికానుంది. వరుణ్ తేజ్ తన స్పోర్ట్స్ డ్రామా షూట్ లో బిజీగా ఉండటంతో… వెంకీ ఎఫ్-3కి బ్రేక్ ఇచ్చి, దృశ్యం-2 టీంతో జాయిన్ అయ్యాడు.
ఎఫ్-3 షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. షూటింగ్ అంతా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. దృశ్యం-2 ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.
ఇలా… నారప్ప, ఎఫ్-3, దృశ్యం-2తో వెంకీ ఈ ఏడాది సందడి చేయనున్నాడు.