పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గోవాలో ప్రారంభమైంది. ఇదే విషయాన్ని చెబుతూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. గోవా లో జరిగే నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం బృందం భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది.
ఆ సెట్ విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ కూర్చుని దేవరకొండ ఉన్నాడు. రక్తం, చెమట,వయోలెన్స్… లైగర్ షూట్ తిరిగి ప్రారంభం అంటూ చెప్పుకొచ్చారు విజయ్. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదల కానుంది.