దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ నివాళి అర్పించారు తలపతి విజయ్. పునీత్ అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా కంఠీరవ స్టూడియోకి వెళ్లి విజయ్ పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు విజయ్.
అందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇక కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ ను అందరూ ఆప్యాయంగా అప్పూ అని పిలుస్తారు. ఇక అతని తండ్రి రాజ్‌కుమార్ స్మారక చిహ్నం సమీపంలోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ కూడా నివాళులర్పించారు.
ఇదిలా ఉండగా పునీత్ రాజ్‌కుమార్ తాజా చిత్రం జేమ్స్ మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. పునీత్ సోదరుడు, కథానాయకుడు శివరాజ్‌కుమార్ స్వరాలు సమకూర్చారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.
Advertisements
ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించగా పునీత్ అన్నలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ అతిధి పాత్రల్లో నటించారు.