ప్రముఖ స్టార్ విశాల్ మరోసారి గాయపడ్డారు, ప్రస్తుతం లాఠీ సినిమా చిత్రీకరణలో ఉంది.. అయితే ఆదివారం ఈ సినిమా సెట్ లో విశాల్ మరోసారి గాయపడ్డారు.
డూప్ లేకుండా సన్నివేశాల కోసం రిస్క్ చేసే హీరోల్లో విశాల్ ఒకరు. ఎందుకంటే యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్లో విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. అయితే పోరాట సన్నివేశాల్లో రియల్ స్టంట్లు చేస్తూ ఇప్పటికే పలుసార్లు గాయపడిన ఆయన.. తాజాగా మరోసారి తీవ్రంగా గాయపడ్డారు.
లాఠీ మూవీ క్లైమాక్స్ సీన్ తెరకెక్కిస్తుండగా హీరో విశాల్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో విశాల్ కాలికి బాగా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి.. వెంటనే చికిత్స కోసం కేరళకు వెళ్లారు.
విశాల్ ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్ షాట్లు చేయొద్దని కోరుతున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలోనూ విశాల్‌కు గాయాలు అయ్యాయి. అప్పుడూ షూటింగ్ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు.
కాగా, వినోద్ కుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా ‘లాఠీ’ తెరకెక్కుతోంది. సనయన కథా నాయిక. ఇందులో విశాల్ ఓ శక్తిమంతమైన పోలీస్‌గా కనిపించనున్నారు.