బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత అక్కడ పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ నెపోటిజం పై నోరు విప్పింది. ఈ వివాదం ముదిరి ముదిరి ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనాకు మధ్య వార్ గా మారింది. అయితే తన నోరు మూయించాలి అనుకున్న మీరు మిగిలిన కోట్ల గొంతులను మూయించగలరా అంటూ ముఖ్యమంత్రికి కంగనా సూటిగా ప్రశ్నించింది. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా పోరాటానికి మద్దతుగా హీరో విశాల్ ముందుకు వచ్చాడు.
సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఒక లేఖను పంపారు. డియర్ కంగన… నీ గట్స్ , ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ఎలా ప్రశ్నించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీ నే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసే సందేశాన్ని సమాజానికి అందించావు. నీకు వందనాలు అంటూ పేర్కొన్నాడు.
Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx
— Vishal (@VishalKOfficial) September 10, 2020