తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోగా విశ్వక్ సేన్ తన సత్తా చాటుతున్నాడు. బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో లేకపోయినప్పటికీ .. అతను చేస్తోన్న వరుస సినిమాలు పర్వాలేదనిపిస్తుండటంతో ఈ హీరోకు క్రేజ్ పెరుగుతోంది. తాజాగా విశ్వక్ సేన్ చేసిన సినిమా ‘హిట్ ‘మంచి విజయాన్ని అందుకుంది. దీంతో హీరోగా తన కెరీర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు విశ్వక్ సేన్. హిట్ సినిమా ఇచ్చిన విజయంతో ఈ యువ హీరో పాగల్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే సినిమా షూటింగ్ జరగనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల గురించి చెప్పుకొచ్చాడు.
నేను కోపిష్టినని అంటుంటారు అదే సమయంలో నాలో స్నేహభావం ఎక్కువగా ఉంటుందని స్నేహితులు చెబుతుంటారు. నాలో స్నేహశీలత మెండుగా ఉండటానికి ప్రధాన కారణం మా అమ్మే. స్నేహితులతో ఎలా మెలగాలో నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. రోజు మా అమ్మ పాతికమందికి అన్నం పెడుతుంటుందని చెప్పాడు. ఇక, విశ్వక్ సేన్ తన అక్క గురించి చెప్పాడు. నేను ఈ ప్రపంచంలో భయపడేది ఒక్క మా అక్క వన్మయికి. నేను ఏ విషయంలోనైనా హద్దులను దాటితే నన్ను ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటుంది. నా గురించి తను ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. అందుకే ఆమె అంటే భయం నాకు అని విశ్వక్ సేన్ చెప్పాడు.
హీరోగా చేసిన ఫలక్ నుమా దాస్ చిత్రాన్ని నేను సొంతంగా నిర్మించాను. ఈ సినిమాకు అమ్మ, అక్కలే కాస్ట్యూమ్ డిజైనర్స్‌గా పని చేశారు. సినిమాలో మా అమ్మ, అక్క ఉపయోగించిన డిజైన్ నచ్చక ఓవర్ గా మాట్లాడినట్లు తెలిస్తే.. అప్పటికప్పుడు ఆ ముంబై హీరోయిన్ ను సినిమా నుంచి తప్పించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా జీవితంలో అసలైన హీరోయిన్స్ అమ్మ, అక్కలేనని.. వారు చేసిన పనులకు వంకలు పెడితే ఊరుకోనని అన్నాడు.