అఖిల్ అక్కినేనికి హిట్ కోసం కుస్తీపడుతున్న కుర్రహీరో.ఇటీవల అక్కినేని వారసుడు భారీ బడ్జెట్ తో, భారీ ఎఫర్ట్ తో నటించించిన చిత్రం ఏజెంట్. అయితే ఏజెంట్ భారీ ప్రమోషన్ చేయబోతున్నాడు.
అఖిల్ కి అండగా ఆస్కార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారు.నటించిన తాజా చిత్రం ఏజెంట్ ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేయనున్న ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వీరిద్దరూ సందడి చేయనున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్.
అయితే దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ తమ క్లోజ్ ఫ్రెండ్ సినిమా ప్రచారం కోసం నిర్వహించే ఈ ఈవెంట్లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఈ కార్యక్రమం తేదీ, వెన్యూకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి.. సైరా నరసింహారెడ్డి తర్వాత చేసిన చిత్రం ఏజెంట్. దీంతో భారీ అంచనాలతో ఈ చిత్రం రూపొందింది.
అలాగే దీని ప్రమోషన్స్ ఖర్చు కోసం కూడా మేకర్స్ వెనకాడటం లేదని తెలిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏజెంట్ ప్రీ రిలీజ్ కోసం భారీగానే ప్లాన్ చేశారట.
ఇందుకోసం తారక్-చరణ్ హీరోలిద్దరిని ఆహ్వానించారట హీరో అఖిల్ అక్కినేని ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే..’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో 2021లో బాక్సాఫిస్ వద్ద సందడి చేశారు అఖిల్. దీంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అఖిల్.
తాజాగా ‘ఏజెంట్’ మూవీతో ఆడియెన్స్ను మరో సారి అలిరించేందుకు సిద్ధమయ్యారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సైరా నరసింహారెడ్డి దర్శకుడు సురేందర్ రూపొందించారు. ఏజెంట్ మూవీని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై ప్రొడ్యూస్ చేశారు.
ఇక సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర ఇద్దరు కిలిసి ఈ సినిమాని నిర్మించారు. అయితే నిర్మాతగా సురేందర్ రెడ్డికి ఇదే తొలి చిత్రం. హీరోయిన్గా సాక్షి వైద్య అలరించనున్నారు. కేరళ హీరో మమ్ముట్టి కీలకమైన క్యారెక్టర్లో కనిపించనున్నారు.
పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.80 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు చేశారట.
ఏజెంట్ మూవీ షూటింగ్ దాదాపు మూడేళ్లు పాటు జరిగింది. ఈ సినిమాలో 8 ప్యాక్స్తో అఖిల్ కనిపించబోతున్నారు. ఇందులోని పాత్ర కోసం బాడీ ఫిట్నెస్ కోసం చాలానే కష్టపడ్డారు అఖిల్.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్'(సీసీఎల్)లో టాలీవుడ్ టీమ్ ‘తెలుగు వారియర్స్’కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు అఖిల్.