టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అతను క్రియేట్ చేసిన సంచలనాలు మరే దర్శకుడు కూడా సాధించలేదు. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా పూరి చేతిలో పడిన తర్వాత పూర్తిగా మారిపోవాల్సిందే. దీనితో కొందరు హీరోలు పూరితో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా పూరితో రెండు కంటే ఎక్కువ సినిమాలు చేసిన వారిని చూద్దాం.
విజయ్ దేవరకొండ
ప్రస్తుతం వీరి కాంబో లో లైగర్ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ ను ప్రకటించారు. జనగణమన అనే ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.
మహేష్ బాబు
మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు పూరి. మొదటి సినిమా పోకిరి సినిమా పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించింది. రెండో సినిమా బిజినెస్ మాన్ మహేష్ లో కొత్త కోణం చూపించింది.
ఎన్టీఆర్
ఆంధ్రావాలా సినిమాతో వీళ్ళు ఇద్దరూ కలవగా ఆ సినిమా షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టెంపర్ అనే సినిమా చేయగా మంచి హిట్ అయింది.
పవన్ కళ్యాణ్
వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. కెమరామాన్ గంగతో రాంబాబు సినిమా షాక్ ఇచ్చినా బద్రి సినిమా ఒక సంచలనం.
రవి తేజా
రవితేజా పూరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా ఆకట్టుకుంది. దేవుడు చేసిన మనుషులు మినహా… ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, నేనింతే, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి.
ప్రభాస్
వీరి కాంబినేషన్ లో ముందు బుజ్జిగాడు సినిమా రాగా ఆ తర్వాత ఏక్ నిరంజన సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఆకట్టుకోలేదు.
అల్లు అర్జున్
దేశముదురు సినిమా బన్నీ లో కొత్త టాలెంట్ ను బయటకు తీసింది. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలతో సినిమా కూడా చాలా బాగా ఆకట్టుకుంది.
నాగార్జున
పూరి, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివమణి సినిమా ఒక సంచలనం అయితే సూపర్ సినిమా ఫ్లాప్ అయింది.