సినిమా పరిశ్రమలో కొన్ని వివాహాలు కాస్త సంచలనంగా ఉంటాయి. ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారో ఊహించడం కాస్త కష్టమే. ప్రేమ పేరుతో కొందరు పెళ్లి అయి విడాకులు తీసుకున్న వారిని ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మంచు మనోజ్ అలాగే వివాహం చేసుకున్నాడు. ఇలా పెళ్లి అయి పిల్లలు ఉన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి లిస్టు చూద్దాం.
మంచు మనోజ్
భూమ మౌనిక రెడ్డిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి కుమారుడు కూడా ఉన్నాడు.
కమల్ హాసన్
భార్యతో విడాకుల తర్వాత గౌతమి తో సహజీవనం చేసారు కమల్. దాదాపు 15 ఏళ్ళ పాటు ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆమెకు అంతకు ముందే సుబ్బా లక్ష్మి అనే కుమార్తె ఉన్నారు.
కళ్యాణ్ దేవ్
మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్. ఆమెకు అంతకు ముందే కుమార్తె ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరూ దూరంగా ఉన్నారని సమాచారం.
శరత్ కుమార్
రాధికతో ప్రేమలో పడి ఆయన వివాహం చేసుకున్నారు. అంతకు ముందే రాధికకు పిల్లలు ఉన్నారు.