కాలమహిమో వారి,ఓర్పూ ఔదార్యమో..! తెలియదు గానీ ఒకప్పటి హీరోయిన్స్ విషయానికొస్తే వృత్తిజీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సజావుగా నడిపించేవారు. కాపురాలు పిల్లలు,వాళ్ళపెంపకం..చదువులు, వాళ్ళపెళ్ళిళ్ళు ఇలా సమాజమనే పందిరిమీద తీగసాగినట్టుగా కుటుంబం కొనసాగేది.ఇది పెళ్ళళ్ళ ప్రస్థావనకు సంబంధించిందే కానీ, మంచీ చెడుల విశ్లేషణ మాత్రం కాదనేది సుస్పష్టం. ఇప్పటి వాళ్ళలో కూడా పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబానికి కట్టుబడిన హోరోయిన్స్ కూడా లేకపోలేదు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఆ సంఖ్య, స్థాయి తగ్గింది.
పిల్లాజెల్లా లాంటి కొనసాగింపు తర్వాత…! అసలు కొందరి హీరోయిన్ల విషయానికొస్తే పెళ్ళే పెద్దప్రశ్నగా మారిపోయింది. పెళ్ళి చేసుకుని కుటుంబ బంధాల్లో చిక్కోకోవడం ఇష్టంలేదా ?!, కుటుంబ కారణాలా !?, లవ్ ఫెయిల్యూర్ లాంటి వ్యక్తిగత కారణాలా ?! అన్నవి అభిమానులను కలవరపెట్టే ప్రశ్నలు. అయితే పెళ్ళికాకుండా సింగిల్ గా మిగిలిపోయిన హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
టబు:
కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన టబు..’నిన్నేపెళ్లాడతా’తో మరింత చేరువయింది..ప్రస్తుతం టబు వయసు 48. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.! టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జునతో ప్రేమ వ్యవహారమేనని ఇండస్ట్రీ టాక్.!
నగ్మా:
తొంబైల్లో దక్షిణాదిని ఒక ఊపు ఊపిన నగ్మా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.. క్రికెటర్ గంగూలి ప్రేమ వ్యవహారం విఫలం అవ్వడం,తర్వాత నటుడు శరత్ కుమార్ తో ప్రేమాయణం పెళ్లివరకూ వెళ్లి బెడిసికొట్టింది.. ఆ తర్వాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించింది.నటి జ్యోతిక , నగ్మా అక్కాచెల్లెల్లు. మెగాస్టార్ చిరు మాస్టర్ సినిమాలో నటించిన నటి రోషిణి కూడా వీరి సోదరే.
శోభన:
యాభై ఏళ్ల శోభన చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చింది..కేవలం సినిమాలు మాత్రమే కాకుండా భరత నాట్యకళాకారిణిగా శోభనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని భాషల్లోనూ వందల సినిమాల్లో నటించింది.. ఇప్పటివరకు వివాహం చేసుకోని శోభన ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటుంది.
సితార:
హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన సితార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది.. పదహారేళ్లకి నటనని ప్రారంభించిన సితార వయసు 45ఏళ్లు..సహనటుడు మురళితో ప్రేమ విఫలమవడమే సితార ఒంటరిగా ఉండిపోవడానికి కారణంగా చెప్తారు..హృదయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మురళి కొడుకు కూడా మనకు సుపరిచితుడే. గద్దల కొండ గణేశ్ చిత్రంలో నటించిన అధర్వ మురళి..
కౌసల్య:
పంచదార చిలక, అల్లుడుగారొచ్చారు ఇతర సినిమాలతో పరిచయం అయిన కౌసల్య కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు..ఈ కన్నడ భామ ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ, బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తుంది.. చిన్నవయసులో నటన ప్రారంభించిన కౌసల్య తన గురించి పట్టించుకోకుండా తన కుటుంబాన్ని పోషించుకోవడంలో మునిగిపోయింది.
కత్రినాకైఫ్:
40 కి దగ్గర్లో పడ్డ …ఈ బాలీవుడ్ భామ కూడా ఇంత వరకు పెళ్లి ప్రయత్నాలేవీ చేయలేదు. సల్మాన్ ఖాన్ తో ప్రేమ , డేటింగ్…ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో వీళ్ల రిలేషన్ బ్రేక్ అప్ అయ్యింది. అప్పటి నుండి కత్రినా ఒంటరిగానే ఉంటోంది!
వీళ్లు మాత్రమే కాదు ప్రస్తుతం హీరోయిన్స్ గా ఉన్న త్రిష,కాజల్, అనుష్క లవ్ ఫెయిల్యూర్స్ యే కారణమా? వీళ్లందరూ కూడా ముప్పై ఐదేళ్లు పై బడిన వారే..త్రిష పెళ్లి ఎంగేజ్మెంట్ తర్వాత ఆగిపోతే, ఇటీవల పెళ్లి గురించి అడిగితే అనుష్క కస్సుబుస్సులాడిన విషయం తెలిసిందే!