రామ్ చరణ్ RC 15లో నటి అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యూటీ RC 15 లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉందంటూ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సిసిల మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. నటుడు SJ సూర్య విలన్ గా నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే జయరామ్, సునీల్, శ్రీకాంత్ , నవీన్ చంద్ర కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీత అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఫస్ట్ లుక్, టైటిల్‌ను మార్చి 27 న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఆవిష్కరించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్తాన్‌లలో షూట్ చేశారు. ఇప్పుడు రెండవ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు.