మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది. అవును మీరు విన్నది నిజమే. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వెంకీ కుడుములకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టిని ఫిక్స్ చేశారట మేకర్స్.
ఇటీవల అనుష్కకు వెంకీ కుడుముల కథ చెప్పగా కథ నచ్చడంతో అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో అనుష్క స్టాలిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ తర్వాత సైరా లో కూడా చిన్న రోల్ చేసింది. ఇక వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య తెలుగు సినిమాలు చేస్తున్నాడు.