అనుష్క త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా ..? అయితే ఆమె ఎవరిని వివాహం చేసుకోనుందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ తో అనుష్క రహస్యంగా ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతూ ఉండగా.. ఆమె రెబల్ స్టార్ కాకుండా మరో వ్యక్తితో ప్రేమలో ఉందా అని చర్చిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి లవ్ ఎపిసోడ్ లేదని ప్రభాస్, అనుష్కలు కొట్టిపారేస్తున్నా అభిమానులు మాత్రం తమ శైలిని మార్చుకోవడంలేదు. అయితే ఇప్పుడు అభిమానులను షాక్ గురి చేస్తూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
అనుష్క ఓ టీమిండియా ఆటగాడితో ప్రేమాయణం కొనసాగిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్నీ బయటకు రానివ్వకుండా వీరిద్దరు జాగ్రత్త పడుతున్నారట. అయితే ఆ టీమిండియా ప్లేయర్ ఎవరనే విషయాన్ని మాత్రం సీక్రెట్‌గా మెయింటెయిన్ చేస్తోందట అనుష్క. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలెక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 38 ఏళ్ల అనుష్క.. వివాహం చేసుకోవాలని ఆమె అభిమానులు కూడా కోరుతుండటంతో ఈమేరకు ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట. ఈ వార్తను టాలీవుడ్ లోని అనుష్క , ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.