బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ట్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు ప్రాజెక్ట్ కె సినిమాకూడా చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
కాగా ఇటీవల దీపికా, ప్రభాస్ ల ఫై పలు సన్నివేశాలు షూట్ చేశారు మేకర్స్. ఈ షూటింగ్ పూర్తి కాగానే దీపికా ముంబై వెళ్ళింది. అయితే తాజా గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో ఫస్ట్ డే సెట్ లో మాట్లాడాను. ప్రభాస్ చాలా కామ్‌గా ఉంటారు. ఆయన సెట్స్‌కు వచ్చినట్లు కూడా అక్కడి చాలా మందికి తెలీదు. ప్రశాంతంగా ఓ మూల కూర్చొని షూటింగ్‌ను గమనిస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక వీటితో పాటు స్పిరిట్ మూవీ లో కూడా ప్రభాస్ నటించబోతున్న సంగతి తెలిసిందే.