అక్రమ సంబధాలు చాలా కామన్ అయిపోయామంటోంది హీరోయిన్ ఎస్తేర్. తను చాలా అక్రమ సంబంధాల గురించి విన్నానని, పెళ్లయి పరాయి మగాడితో సంబంధం కొనసాగించే ఘటనలు తనకు తెలుసని అంటోంది.
“ప్రస్తుతం అక్రమ సంబంధాలు అనేది హాట్ టాపిక్ గా మారింది. సమాజంలో జరుగుతున్న చాలా అక్రమ సంబంధాల్ని నా స్నేహితుల ద్వారా విన్నాను. కొంతమంది తమ అక్రమ సంబంధం గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం సీక్రెట్ గా పని కానిచ్చేస్తున్నారు. సమాజంలో ఇప్పుడివి కామన్ అయిపోయాయి.”
ఉన్నట్టుంది ఈ హీరోయిన్ ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి మాట్లాడ్డానికి ఓ రీజన్ ఉంది. ప్రస్తుతం ఈమె ఓ సినిమా చేస్తోంది. అందులో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ గృహిణిగా ఎస్తేర్ కనిపించనుంది. అందుకే వివాహేతర సంబంధాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.
69 శంకర్ కాలనీ అనే సినిమా చేస్తోంది ఎస్తేర్. ఇందులో ఆమె ఓ వివాహితగా కనిపించనుంది. అయితే పెళ్లయినప్పటికీ పడక సుఖం దక్కని మహిళ పాత్ర అది. అదే టైమ్ లో పక్కనే ఉన్న ఓ అబ్బాయితో ఆమె శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తేర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. సమాజానికి, భర్తకు ఏమని సమాధానం చెప్పిందనేది ఈ సినిమా స్టోరీ.